News May 17, 2024
విజయనగరం రైలు ప్రమాదానికి వారి నిర్లక్ష్యమూ కారణమే: పాండీ

గతేడాది అక్టోబరు 29న కంటకాపల్లి-అలమండ స్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదానికి సీనియర్ రైల్వే ఆపరేటింగ్ అధికారుల నిర్లక్ష్యమూ కారణమేనని ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సంజయ్ పాండీ పేర్కొన్నారు. అదే రోజు మూడు రైళ్లు సిగ్నళ్లను జంప్ చేశాయన్న ఆయన.. నిర్దేశిత వేగం కంటే అధొక వేగంతో వెళ్లినట్లు డేటాలాగర్ పరికరంలో నమోదైనా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు.
Similar News
News April 22, 2025
విజయనగరం: Pic Of The Day

పోషకాహారంపై చిన్నారి వేషధారణ ఆలోచింజేస్తోంది. తెర్లాం మండలం కాగాం గ్రామానికి చెందిన జొన్నాడ సరస్వతి పోషణ పక్వాడాలో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంగన్వాడీ కార్యకర్తలు సరస్వతితో కాయగూరలు, ఆకుకూరలతో వేషధారణ వేయించారు. చెవి దిద్దులుగా టమాటాలు, మెడలో క్యారెట్, గోరు చిక్కుడు హారం, నడుముకు కరివేపాకు కట్టారు. గర్భిణులు ఏ ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందో ఈ చిన్నారి ప్రదర్శనతో వివరించింది.
News April 22, 2025
పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు: VZM SP

బొబ్బిలి PSలో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మోహన్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. పార్వతీపురం ఏకలవ్య స్కూల్లో చదువుతున్న బాలికకు తన మామయ్య ఫోన్ ఫే ద్వారా నగదు మోహన్‌కు పంపారని, డబ్బులు తీసుకొనేందుకు బాలిక బొబ్బిలికి రాగా రూమ్‌కి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. నేరం రుజువు కాగా శిక్ష ఖరారైందన్నారు.
News April 22, 2025
VZM: డోనర్ అవసరం లేదు.. నేరుగా రండి..!

తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు నుంచి ఉచితంగా రక్తాన్ని పొందచ్చని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ ప్రసాదరావు సోమవారం తెలిపారు. రక్తం అవసరమైతే కంటోన్మెంట్ సమీపంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకును సంప్రదించి అవసరమైన గ్రూపు రక్తాన్ని పొందవచ్చన్నారు. డోనర్ అవసరం లేదని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదన్నారు.