News August 4, 2024

‘విజయనగరం వాసులం.. ఫ్రెండ్‌షిప్‌కి ప్రాణమిస్తాం’

image

ఉమ్మడి విజయనగరం వాసులు ఫ్రెండ్‌షిప్‌‌కి ప్రాణమిస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విడదీయలేని బంధాలెన్నో. సంతోషంలోనే కాదు ఆపదలోనూ అండగా ఉండే మిత్రులెందరో. పాఠశాల స్థాయి నుంచి ఉన్న స్నేహాలైతే లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్‌ పార్టీలో కన్నీరుపెట్టిన మిత్రులెందరో కదా. అలాంటి వారి కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ ప్రాణ స్నేహితుడు ఎవరు?
☞ Happy Friendship Day

Similar News

News May 7, 2025

ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలి: కలెక్టర్

image

ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని చెప్పారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పని మొదలయ్యేలా చూడాలన్నారు. రెండుపూటలా కనీసం 6 గంటలు పనులు చేయించాలని ఆదేశించారు.

News May 7, 2025

అంతర్ జిల్లాల బదిలీలు చేయాలి: ఏపీటీఎఫ్

image

ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సింహాచలం, బి.జోగినాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి పట్టణంలో శనివారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీలు చేసి స్పోజ్ కేటగిరీలో ఎంటీఎస్ టీచర్లను పరిగణించాలన్నారు. 1998/2008 ఎంటీఎస్ టీచర్ల బదిలీలు కూడా రెగ్యులర్ టీచర్లతో చేయాలన్నారు. సింగిల్ టీచర్ పాఠశాలలకు రెండో టీచర్‌ను నియమించాలన్నారు.

News May 7, 2025

భోగాపురం మండలంలో ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్

image

భోగాపురం మండలంలోని పోలిపల్లి, కౌలువాడ, లింగాలవలసలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ డ్వామా పీడీ శారదా కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారని ఏపీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.