News March 2, 2025
విజయనగరం వ్యాయమ ఉపాధ్యాయుల జిల్లా సంఘం ఎన్నిక

వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోపి లక్ష్మణరావు, కార్యదర్శిగా నల్లా వెంకటనాయుడు ఎంపికయ్యారు. కార్యదర్శిగా ఎన్నికైన వెంకటనాయుడు పెంట జిల్లా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్నాడు. విజయనగరంలో ఆదివారం జరిగిన జిల్లా సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరి ఎంపికపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యాయమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని వీరు తెలిపారు.
Similar News
News March 3, 2025
మానస.. ఆత్మ స్థైర్యానికి సెల్యూట్..!

చదవాలన్న సంకల్పం ముందు మానసిక అంగవైకల్యం తలవంచింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వి.ఎం.పేటకు చెందిన పెట్ల మానస ఇంటర్ పరీక్షలకు హాజరైంది. చిన్నప్పటి నుంచి మానసికస్థితి సరిగా లేకపోయినా తల్లిదండ్రుల సాయంతో చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం HEC సెకండియర్ చదువుతున్న మానస.. తన తండ్రి దేముడు సాయంతో సోమవారం పరీక్షకు హాజరయ్యింది. సహాయకురాలి సాయంతో పరీక్ష రాసింది. ఆమె ఆత్మ స్థైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.
News March 3, 2025
VZM: నేటి నుంచి ఇంటర్ సెకిండియర్ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో 177 అన్ని యాజమాన్య కళాశాలల నుంచి 20,368 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి.
News March 3, 2025
చీపురుపల్లిలో యాక్సిడెంట్.. లైన్మెన్ మృతి

పాలవ్యాను ఢీకొని లైన్ మాన్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. పేరిపికి చెందిన కర్ణపు సత్యం(43) చీపురుపల్లి ఆర్ఈసీఎస్‌లో లైన్మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అమ్మవారి జాతరలో విధుల్లో భాగంగా ఆంజనేయపురం వైపు వెళ్తుండగా.. చీపురుపల్లి టీడీపీ ఆఫీసు ఎదురుగా పాలవ్యాను ఢీకొట్టింది. తీవ్రగాయాలతో సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.