News March 28, 2025

విజయనగరం: శ్రీ విశ్వావ‌సునామ‌ ఉగాది వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు

image

శ్రీ విశ్వావ‌సునామ ఉగాది వేడుక‌ల‌ను సంప్ర‌దాయ‌భ‌ద్దంగా నిర్వ‌హించేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి కోరారు. ఉగాది వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ సూచ‌న‌ల మేర‌కు ఈనెల 30వ తేదీన ఉగాది వేడుక‌ల‌ను క‌లెక్ట‌రేట్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

Similar News

News September 18, 2025

పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

image

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 17, 2025

ఈనెల 19న ఉద్యోగుల కోసం గ్రీవెన్స్: కలెక్టర్

image

ఈ నెల 19వ తేదీ శుక్ర‌వారం ఉద్యోగుల కోసం ప్ర‌త్యేక గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.రామ‌సుంద‌ర్ రెడ్డి బుధవారం తెలిపారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో ఈ కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొంటార‌ని వెల్లడించారు. ఉద్యోగులు త‌మ స‌మ‌స్య‌ల‌పై ఈ గ్రీవెన్స్‌లో ధ‌ర‌ఖాస్తుల‌ను అంద‌జేయ‌వ‌చ్చున‌ని సూచించారు. ప్రతి 3వ శుక్రవారం కార్యక్రమం జరుగుతుందన్నారు.

News September 17, 2025

VZM: సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం

image

విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసు చెట్లకు వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గంట్యాడ (M) కొండతామరపల్లిలోని చల్ల అప్పలనాయుడు కల్లంలో గుర్తించిన ఈ చెట్లకు ఉదయం 9.15 గంటలకు బొట్టు పెట్టే కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకటరావు, ఈవో శిరీష, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్, ప్రెసిడెంట్ భాస్కర్, భక్తులు పాల్గొన్నారు.