News July 2, 2024
విజయనగరం సంగీత కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

విజయనగరం మహరాజా సంగీత, నృత్య కళాశాలలో నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సు, రెండేళ్ల డిప్లమో కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ K.A.V.L.N శాస్త్రి తెలిపారు. 01.07.2023 నాటికి 10 సంవత్సరాల వయసు నిండిన వారు అర్హులని, 60 ఏళ్ల లోపు వారూ చేరవచ్చన్నారు. ఈ రెండు కోర్సులకు ప్రవేశ రుసుములుగా రూ.1600, రూ.2100 చొప్పున నిర్ణయించామన్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.
Similar News
News July 5, 2025
విజయనగరం జిల్లాలో నేడు జాతీయ లోక్ అదాలత్

విజయనగరం జిల్లా కోర్టులో శనివారం జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగపరచుకోవాలని జిల్లా జడ్జ్ బబిత సూచించారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 20 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, చెక్కు బౌన్స్ కేసులు ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిస్కారం చేసుకోవచ్చన్నారు.
News July 4, 2025
ఒక్క మెరకముడిదాంలోనే 1100 మంది తగ్గిపోయారు: జడ్పీ ఛైర్మన్

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగించే విషయమని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జడ్పీ సర్వ సభ్య సమావేశంలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఒక్క మెరకముడిదాం మండలంలోనే 1100 మంది విద్యార్థులు తగ్గిపోయారని, జిల్లాలో చూస్తే ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుందన్నారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించారు.
News July 4, 2025
విద్యార్థులు ఎందుకు తగ్గారు: మంత్రి

గత ఏడాది కన్నా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు తగ్గుదలపై శాస్త్రీయంగా విశ్లేషణ జరగాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో శుక్రవారం జరిగిన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిపైన సుమారు రూ.70 వేలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, అయినప్పటికీ నమోదు తగ్గడానికి గల కారణాలను విశ్లేషించుకోవాలన్నారు. విద్యార్థుల తగ్గుదలపై కారణాలు గుర్తించాలని డీఈఓకు ఆదేశించారు.