News October 29, 2025
విజయమే లక్ష్యం.. జూబ్లీహిల్స్ కోసం కేబినెట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయానికి ఉన్న అవకాశాలను కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లకు బాధ్యతలు అప్పగించిన పార్టీ ఇపుడు మంత్రి వర్గంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తప్ప అందరికీ బాధ్యతలు అప్పగించింది. ఒక్కో డివిజన్ బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించి ప్రచారం చేపట్టనుంది. స్థానిక నేతలను సమన్వయ పరుస్తూ ఈ ప్రచారం కొనసాగనుంది.
Similar News
News October 30, 2025
TU: గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని లా కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా చేరడానికి నియామక చేపట్టినట్లు లా కళాశాల ప్రిన్సిపల్ ప్రసన్నరాణి తెలిపారు. LLM/ML లేదా సరిసమాన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సందర్శించాలన్నారు.
News October 30, 2025
కాగజ్‌నగర్: సైబర్ నేరగాడి అరెస్ట్

కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆన్ లైన్ ద్వారా రూ.45790 పోగొట్టుకొని ఫిర్యాదు చేసినట్లు CI కుమారస్వామి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు D-4C బృందం ద్వారా సాంకేతిక ఆధారాలను సేకరించి MPకి చెందిన ఆశిష్ కుమార్ దోహార్‌ను పట్టకున్నారు. అతడి ఖాతాలోని రూ.34537.38 ఫ్రీజ్ చేసినట్లు CI వెల్లడించారు.
News October 30, 2025
దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రేయస్ దూరం?

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో 2 నెలలపాటు కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబర్, డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌కు ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో న్యూజిలాండ్ జరిగే ODI సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో క్యాచ్ అందుకుంటూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే.


