News March 20, 2025
విజయవాడలో అగ్నిప్రమాదం

విజయవాడలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మాచవరం పోలీసుల వివరాల మేరకు బందర్ రోడ్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద కిచెన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెస్టారెంట్‌లోని కిచెన్ మొత్తం దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 16, 2025
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: సిద్దిపేట సీపీ

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కేసులు నమోదుకానున్నాయని CP విజయ్‌కుమార్ ప్రకటించారు. విజయోత్సవాల్లో పటాకులు కాల్చడం, అనుమతి లేని ర్యాలీలు నిర్వహించడం, ప్రభుత్వ అధికారుల పనికి ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొదటి దశ ఎన్నికల్లో 20 కేసులు, రెండవ దశలో 13 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News December 16, 2025
15 బంతుల్లో హాఫ్ సెంచరీ..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ మరోసారి చెలరేగారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. మొత్తంగా 22 బంతుల్లో 73 రన్స్ బాదారు. ఇందులో 7 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. తొలుత రాజస్థాన్ 216/4 స్కోర్ చేయగా, ముంబై 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరో బ్యాటర్ రహానే 41 బంతుల్లో 72* రన్స్ చేశారు.
News December 16, 2025
మెస్సీ టూర్‌లో ‘బెస్ట్ సెల్ఫీ’.. నెట్టింట ప్రశంసలు!

GOAT టూర్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఫొటో దిగేందుకు సెలబ్రిటీలు పోటీ పడగా ఓ స్పెషల్ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పర్యటనలో తమకు రక్షణగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్‌కు మెస్సీతో పాటు రోడ్రిగో డిపాల్, సువారెజ్ స్వయంగా కారులో సెల్ఫీ ఇచ్చారు. స్టార్ ప్లేయర్స్ అందరూ నవ్వుతూ ఇచ్చిన ఈ ఫోటోను ‘బెస్ట్ సెల్ఫీ’ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. వారి నిరాడంబరతను ప్రశంసిస్తున్నారు.


