News July 5, 2025

విజయవాడలో అభివృద్ధి పనులకు టెండర్ల ఆహ్వానం

image

విజయవాడలో రూ.20.31 కోట్లతో 84 అభివృద్ధి పనులు చేపట్టేందుకు నగరపాలక సంస్థ (వీఎంసీ) టెండర్లు ఆహ్వానించింది. డ్రైన్లు, రహదారులు, కల్వర్టులు, నీటి సరఫరా మరమ్మతులే లక్ష్యమని కమిషనర్ హెచ్‌ఎం. ధ్యానచంద్ర తెలిపారు. ఆసక్తిగల గుత్తేదారులు వివరాల కోసం https://apeprocurement.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Similar News

News July 5, 2025

చేయూతను అందించడమే పీ4 లక్ష్యం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న పీ4 కార్యక్రమంపై శుక్రవారం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గ్రామాల్లో 10% మార్గదర్శులను, దిగువ స్థాయిలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాలను ఎంచుకుని వారికి పీ4 ఉద్దేశ్యం వివరించాలన్నారు. దిగువ స్థాయి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక బాధ్యత కింద చేయూత అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

News July 5, 2025

SUPER.. టాప్ 5లో జగిత్యాల విద్యార్థినికి చోటు

image

బాసర, MBNR IIITల్లో JGTL జిల్లా నుంచి 66 మంది విద్యార్థులు సెలెక్ట్ అయినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 1,690 సీట్లకు గాను జిల్లా నుంచి విద్యార్థిని వర్షిణి టాప్ 5లో ఎంపిక కావడంపై పలువురు ఆమెను అభినందిస్తున్నారు. అలాగే ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 7, 8, 9 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అటెండ్ కానివారు తమకు కేటాయించిన సీట్లు కోల్పోయే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.

News July 5, 2025

విజయవాడలో ఆదిత్య ఫార్మసీ MD ఆత్మహత్య..!

image

విజయవాడ అయోధ్య నగర్‌లోని క్షత్రియ భవన్‌లో ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ సాగి వెంకట నరసింహారాజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలే కారణమని కుటుంబీకులు చెబుతున్నారు. సింగ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.