News September 6, 2024
విజయవాడలో ఇప్పటికీ 1టీఎంసీ నీరు ఉంది: CM చంద్రబాబు
రానున్న రెండు మూడు రోజుల్లో విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టనున్న పనులను CM చంద్రబాబు వివరించారు. రేపటి నుంచి రేషన్ కిట్ల పంపిణీ, విద్యుత్, మంచినీటి సరఫరా చేస్తామని విజయవాడలో అన్నారు. అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో ఉన్న నీటిని మోటార్లు పెట్టి తోడిస్తామని చెప్పారు. నగరంలో ఇంకా 1టీఎంసీ నీరు ఉన్నట్లు.. త్వరలోనే తోడుతామన్నారు. అనంతరం పారిశుద్ధ్య పనులు నిర్వహించి బ్లీచించ్ చేస్తామని చెప్పారు.
Similar News
News November 25, 2024
మచిలీపట్నం: రైలు కిందపడి దంపతుల ఆత్మహత్యాయత్నం.. భార్య మృతి
మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిజాంపేటకు చెందిన దంపతులు గోపీకృష్ణ-వాసవి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన భర్త ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 2011లో వీరికి వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయినప్పటి నుంచి భార్యతో చిన్న చిన్న గొడవలు ఉండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు గోపీకృష్ణ తెలిపాడు.
News November 25, 2024
మండవల్లి: ‘ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేశాడు’
మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్నవరం గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో రోయ్యూరు నగేశ్ బాబు అనే నిందితుడు తన తమ్ముడు రోయ్యూరు సురేశ్, అత్త భ్రమరాంభను కత్తితో దారుణంగా హత్యచేశాడని తెలిపారు. ఈ కేసులో 48 గంటలలో నిందితులను అరెస్ట్ చేసిన కైకలూరు సీఐ రవికుమార్‌ను, ఎస్ఐను డీఎస్పీ అభినందించారు.
News November 25, 2024
కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో జూన్ 2024లో నిర్వహించిన బీపీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 29లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.