News August 17, 2025
విజయవాడలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

విజయవాడలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ. 240గా విక్రయిస్తున్నారు. అదే విధంగా విత్ స్కిన్ కేజీ రూ.200 పలుకుతుంది. మటన్ కేజీ రూ. 850 ఉంది. విజయవాడ నగర వ్యాప్తంగా చికెన్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా నాన్‌వెజ్ ధరలు పెరుగుతున్నాయని మాంసాహార ప్రియులు అంటున్నారు.
Similar News
News August 17, 2025
MHBD: భారీ వర్షాలు.. ఉన్నత స్థాయి సమీక్ష!

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో MHBD జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సీతక్క నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల జిల్లాలోని లో లెవల్ వంతెనలపై వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయన్నారు. దీంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలు రాం చంద్రు నాయక్, మురళీ నాయక్, ఇంచార్జ్ కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
News August 17, 2025
శ్రీశైలం డ్యామ్‌కు తగ్గిన వరద.. 2 గేట్లు మూసివేత

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. దీంతో డ్యామ్ 5 గేట్లలో శనివారం ఒక్క గేటు, ఆదివారం మరొక గేటు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం మూడు గేట్లద్వారా 79,269 క్యూసెక్కుల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65,807 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి డ్యాం నీటిమట్టం 881.40 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం 195.6605 టీఎంసీలుగా నమోదైంది.
News August 17, 2025
NLG: రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ వార్నింగ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి TPCC వార్నింగ్ ఇచ్చింది. ఎంత చెప్పినా వినకుంటే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదని TPCC క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పిసిసి చీఫ్‌తో చర్చించినట్లు తెలిపారు. వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని అన్నారు. తనది మంటల ఆర్పే పని.. మంటలు పెట్టే పని కాదన్నారు.