News September 20, 2025

విజయవాడలో కొత్త రూపంలో డ్రగ్స్

image

విజయవాడలో కొత్తరకం డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. సరిగ్గా మెడికల్ షాపులో టాబ్లెట్స్‌లా గంజాయి టాబ్లెట్ల ఫోటోలు బయటకు రావడం హల్చల్‌గా మారింది. నగరంలో మూడు, నాలుగు బస్తాలకు పైగా ఇలాంటి డ్రగ్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయని తెలుస్తోంది. మాచవరం పరిధిలో ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతోందని సమాచారం. దసరా ఉత్సవాలపై పోలీసుల దృష్టి ఉండడంతో డ్రగ్స్ సప్లై చేసే ముఠా సభ్యులు చెలరేగిపోతున్నారు.

Similar News

News September 20, 2025

డ్రోన్లతో వ్యవసాయం లాభసాటి మార్గం: కలెక్టర్

image

లింగపాలెంలో వరి పొలాల్లో డ్రోన్లతో నానో యూరియా స్ప్రే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి శనివారం పరిశీలించారు. రైతులకు సబ్సిడీతో అధునాతన వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. డ్రోన్లతో ఎరువులు, పురుగు మందులు 5 నిమిషాల్లోనే పిచికారీ అవ్వడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News September 20, 2025

నెల్లూరు: కూలితే ప్రమాదమే..!

image

జాతీయ రహదారి నుంచి కోవూరు మండలం ఇనమడుగు సెంటర్‌కు వెళ్లే రహదారిలో భారీ వాహనాలు రాకపోకలు సాగించకుండా ఏర్పాటు చేసిన భారీకేడ్ కూలేందుకు సిద్ధంగా ఉంది. ఓ వైపు కింది భాగం ఊడిపోయి పక్కకు జరిగిపోయింది. ఈ క్రమంలో ఆ భారీకేడ్ పడిపోయి ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం వాహనాల రాకపోకల్లో భారీకేడ్ పడిపోతే పెనుప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News September 20, 2025

హెయిర్ క్రింపింగ్‌ ఎలా చేయాలంటే?

image

కొందరు అమ్మాయిలకు జుట్టు పలుచగా ఉంటుంది. ఒత్తుగా కనిపించాలని పార్లర్‌కి వెళ్లి హెయిర్ క్రింపింగ్ చేయించుకుంటారు. అయితే కొన్ని టిప్స్ పాటించి ఇంట్లోనే దీన్ని చేసుకోవచ్చు. ముందు జుట్టుకు హెయిర్ ప్రొటక్షన్‌ను అప్లై చేసి చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. జుట్టును లేయర్స్‌గా తీసుకుంటూ హెయిర్ క్రింపర్‌తో గట్టిగా ప్రెస్ చేయాలి. జుట్టు మొత్తం ఇలా చేశాక హెయిర్ స్ప్రే చేస్తే చాలు జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది.