News October 7, 2025

విజయవాడలో చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

image

చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడలో మంగళవారం జరిగింది. గాయత్రీ నగర్లోని నలంద స్కూల్లో చెట్లు నరికేందుకు పమిడిముక్కల నుంచి రమణ అనే వ్యక్తిని పని నిమిత్తం తీసుకొచ్చారు. చెట్టు నరుకుతూ ఉండగా రమణ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 7, 2025

స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్స్

image

* ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌కు నామినేట్ అయిన అభిషేక్ శర్మ, కుల్దీప్, బ్రయాన్(ZIM)
* DGCA డ్రోన్ పైలట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినట్లు ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ
* సియట్ అవార్డ్స్‌లో సంజూ శాంసన్ టీ20 బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, శ్రేయస్ అయ్యర్ స్పెషల్ అవార్డ్ అందుకున్నారు.
* ఆస్ట్రేలియాపై ఆడడం తనకు ఇష్టమని, అక్కడి ప్రజలు క్రికెట్‌ను ఎంతో ప్రేమిస్తారన్న రోహిత్ శర్మ

News October 7, 2025

SKLM: పిడుగుపాటుతో ముగ్గురు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి

image

మెలియాపుట్టి మండలం గంగరాజపురం క్వారీ వద్ద పిడుగుపాటుతో ముగ్గురు కూలీలు మృతి చెందడం పట్ల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పిడుగుపాటుతో మృతి చెందడం చాలా దురదృష్టకరమన్నారు. అస్వస్థతకు గురై టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.

News October 7, 2025

మెళియాపుట్టి: పిడుగుపాటు ఘటనలో మృతులు వీరే

image

మెలియాపుట్టి మండలంలోని జంగాలపాడు గ్రానైట్ క్వారీ వద్ద మంగళవారం పిడుగుపాటుకు గురై మృతిచెందిన కార్మికుల వివరాలు ఇలా ఉన్నాయి. జ్ఞానేశ్వర్(రాజస్థాన్), పింటు(మధ్యప్రదేశ్), కుమార్(క్వారీ మేనేజరు,బీహార్) ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. వీరు గత కొన్నాళ్లుగా క్వారీలో కార్మికులుగా ఉన్నారు.