News February 19, 2025

విజయవాడలో జీబీఎస్ వైరస్ కలకలం

image

విజయవాడలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళ (30) ఈనెల 18వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు జీబీఎస్ వైరస్‌గా అధికారులు నిర్ధారించారు. ఆమెను ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 28, 2026

పాక్ సెమీస్‌కు వెళ్లాలంటే..

image

ఇంగ్లండ్‌ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. నేడు శ్రీలంకతో జరిగే చివరి S-8 మ్యాచ్‌లో పాక్ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ పాక్ మొదట బ్యాటింగ్ చేస్తే లంకను 64 పరుగుల తేడాతో ఓడించాలి. అదే ఛేజింగ్‌లో అయితే 13.1 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. అప్పుడే రన్ రేట్ పరంగా కివీస్‌ను వెనక్కి నెట్టి పాక్ సెమీస్‌కు చేరుకుంటుంది. లేదంటే న్యూజిలాండ్ ముందడుగు వేస్తుంది.

News February 28, 2026

ఇరాన్‌తో సుదీర్ఘ యుద్ధం ఉండదు: JD వాన్స్

image

ఇరాన్‌పై ఒకవేళ సైనిక దాడులు చేసినా అది సుదీర్ఘ యుద్ధానికి దారితీసే అవకాశం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ అణు దేశంగా మారకుండా అడ్డుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం సైనిక, దౌత్యపరమైన వ్యూహాలను పరిశీలిస్తోందని తెలిపారు. గతంలో ఇరాక్ యుద్ధం వంటి తప్పులు మళ్లీ జరగవని పేర్కొన్నారు. ప్రస్తుతానికి చర్చల ద్వారానే పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

News February 28, 2026

పనీర్ vs సోయా చంక్స్: ప్రొటీన్ లెక్కల్లో ట్విస్ట్

image

పనీర్ కంటే సోయా చంక్స్‌లోనే ప్రొటీన్ ఎక్కువ. 100 గ్రాముల పనీర్‌లో 18 గ్రాముల ప్రొటీన్ ఉంటే సోయాలో 52 గ్రాములు ఉంటుంది. కానీ, మనం ఒకేసారి 100 గ్రాముల పనీర్ తినగలం. అదే సోయా చంక్స్ ఉడికాక అంత మొత్తంలో తినడం కష్టం. సాధారణంగా మనం తినగలిగే 20 గ్రాముల సోయా ద్వారా 10 గ్రాముల ప్రొటీనే అందుతుంది. కాబట్టి ప్రొటీన్ డెన్సిటీలో సోయా బెటర్ అయినా.. శరీరానికి అందే పోషకాల పరంగా మాత్రం పనీర్ బెస్ట్ ఛాయిస్.