News May 8, 2024
విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు.. (2/3)

మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* మచిలీపట్నం- విజయవాడ మధ్య తిరిగే బస్సులు ఆటోనగర్ గేటు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్, పడవల రేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్‌లో వెళతాయి. * ఏలూరు- విజయవాడ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్, పడవలరేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్‌లో వెళతాయి.
Similar News
News July 9, 2025
వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News July 9, 2025
మచిలీపట్నం: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం చిలకలపూడిలో కొనసాగుతున్న మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధిత శాఖాధికారులు చర్యలు చేపట్టారు. PGT, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా సంబంధిత పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత, ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను పాఠశాల పని వేళలలో అందజేయాలని ప్రిన్సిపల్ బేతపూడి రవి కోరారు.
News July 9, 2025
కృష్ణా: రేపే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్

విద్యార్థుల అభ్యాసాన్ని, అభివృద్ధిని సమీక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,798 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జరిగే ఈ సమావేశంలో 2,65,574 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు పాఠశాలల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.