News June 1, 2024
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరం: చంద్రబాబు
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని కోరారు. ఇతర కారణాల వల్ల ప్రజల చనిపోతున్నారని అధికారులు అనడం సరికాదని హితవు పలికారు.
Similar News
News November 29, 2024
వైసీపీ నేత కోసం పోలీసుల గాలింపు
గండూరి ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు వైసీపీ నేత గౌతమ్ రెడ్డితో పాటు మరికొందరి అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా అనుమానిస్తున్న మాజీ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డిపై డిసెంబర్ రెండో తేదీ వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని కోర్టు తెలిపింది. ఈ ఘటనపై విజయవాడ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
News November 28, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో నాలుగేళ్ల బీఎస్సీ బయోమెడికల్ కోర్సు విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 10,11,12,13,16,17 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టులవారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని విద్యార్థులను కోరింది.
News November 28, 2024
కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే వర్ధంతి
మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో గురువారం మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీకే బాలాజీ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సముద్దరణకు ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు.