News February 20, 2026
విజయవాడలో దారుణం.. కూతురి పట్ల తండ్రి అసభ్య ప్రవర్తన

విజయవాడ YSR కాలనీలో దారుణం వెలుగు చూసింది. మద్యం మత్తుకు బానిసైన ఓ తండ్రి తన 13 ఏళ్ల కుమార్తెపైనే అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి వదిలి వెళ్లిపోవడంతో తండ్రి వద్దే ఉంటున్న ఆ బాలికకు ఈ వేధింపులు నరకంగా మారాయి. బాధితురాలు తన స్కూల్ టీచర్‌కు ఈ విషయాన్ని తెలపడంతో, టీచర్ చైల్డ్ లైన్ సహాయంతో కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిపై చర్యలకు సిద్ధమయ్యారు.
Similar News
News February 20, 2026
నెక్కొండలో ఇద్దరు ఉపాధ్యయులు సస్పెండ్

వరంగల్ జిల్లా నెక్కొండ మండల పరిధిలో పని చేస్తున్న ఇద్దరు ఎస్జీటీ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈవో రంగయ్య శుక్రవారం ఉత్తర్వులు జరీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరవుతున్న అంకం ప్రవీణ్ కుమార్, రామారపు రవి సస్పెండ్ అయ్యారు. ప్రవీణ్ కుమార్ అజ్మీర మంగ్యా తండా MPPS, రవి గొట్లకొండ MPPSలలో ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్నారు.
News February 20, 2026
HNK: మద్యం రహిత గ్రామంగా ఉప్పల్ పల్లి

జిల్లాలోని కమలాపూర్ మండలం ఉప్పల్ పల్లి గ్రామం మద్యం రహిత గ్రామంగా పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. సర్పంచ్ ర్యాకం శ్రీనివాస్, పాలకవర్గం కృషితో గ్రామంలో ఉన్న బెల్టు షాపుల యజమానులు స్వచ్ఛందంగా నేటి నుంచి మద్యం విక్రయాలు ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు మరింత కృషి చేస్తామని సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. మద్యం అమ్మకాలు నిలిపి వేసినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
News February 20, 2026
సిద్దిపేట: యువత నుంచి ధరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలకు స్వయం ఉపాధి కోసం అందిస్తున్న పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సిద్దిపేట జిల్లా మైనారిటీ శాఖ ఇంచార్జి అధికారి నాగరాజమ్మ తెలిపారు. తుర్క కాశి ముస్లింలకు టూల్ కిట్స్, జనరటర్లు, అలాగే ముస్లిం మైనారిటీ యువతకు ఈ స్కూటర్లు ఈ పథకంలో ఉన్నాయన్నారు. ఈ నెల 20 నుంచి మార్చి 1 వరకు ఆన్లైన్ లో ధరఖాస్తూ చేసుకోవాలన్నారు.


