News January 16, 2026

విజయవాడలో దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య!

image

విజయవాడ కేదారేశ్వరరావుపేటలో దారుణం జరిగింది. శివ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్న హుస్సేన అనే వివాహిత శుక్రవారం తెల్లవారుజామున హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే శివ కుమార్ ఆమెను హతమార్చి పరారైనట్లు సమాచారం. అజిత్‌సింగ్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Similar News

News February 21, 2026

నిర్మల్: ముగిసిన ఎన్నికలు.. అందని భరోసా!

image

రబీ సాగు పెట్టుబడుల కోసం నిర్మల్ జిల్లా రైతాంగం రైతు భరోసా నిధుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ నిధులు, మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం అయ్యాయి. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, వారం గడుస్తున్నా అతీగతీ లేదు. జిల్లాలోని లక్షకు పైగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 21, 2026

కాకినాడకు కొత్త ఎయిర్‌పోర్ట్.. తుని-అన్నవరం మధ్యే ఫిక్స్!

image

రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 9 ఎయిర్‌పోర్టులు నిర్మించే ప్రణాళికలో భాగంగా కాకినాడ జిల్లా తుని – అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. తొలుత కరప మండలం గురజానాపల్లిలోని సాల్ట్ భూములను పరిశీలించినా, సాంకేతిక కారణాలతో తుని ప్రాంతాన్ని ఎంపిక చేస్తూ డీపీఆర్ సిద్ధం చేశారు. ఇక్కడ భూసేకరణ వల్ల ఆర్థిక భారం పడినా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఇక్కడే నిర్మాణానికి అంగీకరించింది.

News February 21, 2026

తాండూరు కౌన్సిలర్‌పై కత్తులతో దాడి

image

తాండూరు 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షాద్‌పై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఈర్షాద్ పక్కటెముకలకు తీవ్ర గాయాలవ్వడంతో, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం HYDకు తరలించారు. పోలీసులు బాధితుడి నుంచి వాంగ్మూలం సేకరించి కేసు నమోదు చేశారు. పాత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.