News July 22, 2024

విజయవాడలో నిత్య పెళ్లికొడుకు అరెస్ట్

image

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో మారు పేర్లతో ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేసుకొని ఒంటరి మహిళలకు వల వేసిన నిత్య పెళ్లికొడుకును గవర్నర్ పేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన మోహన్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తానంటూ పలు మ్యాట్రిమోనీ సైట్లలో ఒంటరి మహిళలను మోసం చేసి నగదు వసూలు చేసి పారిపోయేవాడు. పలు ఫిర్యాదులు రావడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. 

Similar News

News January 23, 2026

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్నవరం రాక

image

హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కేంద్ర గనులు మరియు బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గుడివాడ ఆర్‌డీఓ జి. బాల సుబ్రహ్మణ్యం సహా పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కిషన్ రెడ్డి విజయవాడ వైపు బయలుదేరి వెళ్లారు.

News January 23, 2026

కృష్ణా: ఈ శాఖలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

image

నిరుద్యోగ యువతకు భారతీయ పోస్టల్ శాఖ శుభవార్త తెలిపింది. దేశ వ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి 28,740 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌కు 1,215 పోస్టులు కేటాయించగా, మచిలీపట్నం డివిజన్ పరిధిలో 27 ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరగనుంది. దరఖాస్తులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు స్వీకరించనున్నారు.

News January 22, 2026

EVM గోడౌన్ భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలు విషయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.