News August 31, 2025
విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే!

విజయవాడలో ఆదివారం మాంసం ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్‌లెస్ కేజీ రూ. 220, స్కిన్ కేజీ రూ. 210. చేపలు రాగండి కేజీ రూ. 200, బొచ్చ కేజీ రూ. 230. మటన్ కేజీ రూ. 900 వద్ద స్థిరంగా ఉంది. కోడిగుడ్లు 30 గుడ్ల హోల్‌సేల్ ధర రూ. 170కి పెరిగింది. (గతవారం రూ. 160). మరి ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News September 1, 2025
NGKL: ప్రీ-ప్రైమరీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నాగర్‌కర్నూల్ జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్‌స్ట్రక్టర్ల ఉద్యోగానికి ఇంటర్మీడియట్, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హత కనీస అర్హతలుగా నిర్ణయించారు. దరఖాస్తులను ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు తెలిపారు.
News September 1, 2025
భువనగిరి: భూమికి పచ్చాని రంగేసినట్లు..

భూదాన్ పోచంపల్లి పెద్ద చెరువు ఆయకట్టులో వరి పొలాలు పచ్చని రంగుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపుగా పెరిగిన వరి చేలు చూడముచ్చటగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు. కనుచూపుమేరలో పచ్చని రంగేసినట్లు కనిపించే పొలాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News September 1, 2025
కరీంనగర్ జిల్లాకు మొండిచేయి

సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ రైలు (నంబరు 20101/02)కు మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ కల్పించిన విషయం తెలిసిందే. అయితే, జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో కూడా హాల్టింగ్ కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. జమ్మికుంటలో హాల్టింగ్ కల్పిస్తే.. HZBD, HSNB, పరకాల, భూపాలపల్లి, మానకొండూరు ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలగనుంది. సమస్యపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ చూపాలని కోరుతున్నారు.