News March 6, 2025
విజయవాడలో నేడు నారా భువనేశ్వరి పర్యటన

విజయవాడకు నేడు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రానున్నారు. స్టెల్లా కాలేజ్ సమీపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి నేడు ఉదయం ఆమె భూమి పూజ చేయనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆంధ్రాలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News November 8, 2025
NLR: 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర

నెల్లూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ యాత్ర జరగనుంది. వాల్ పోస్టర్లను నెల్లూరులో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్సీలు మాధవరెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News November 8, 2025
DANGER: ఇయర్‌ఫోన్లు అధికంగా వాడుతున్నారా?

శరీరంలో ఇయర్‌ఫోన్ భాగమైపోయిందా అన్నట్లు కొందరు ఉదయం నుంచి రాత్రి వరకూ దానిని వాడుతుంటారు.. అలా గత మూడేళ్లుగా రోజుకు 12గంటలు ఇయర్‌ఫోన్లు వాడిన ఓ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. వినికిడి తగ్గిపోవడం, ‘టిన్’ శబ్దం వినిపించడంతో ఆమె ENT ఆస్పత్రికి వెళ్లగా చెవిలో పొర ఇన్‌ఫెక్ట్ అయి చీము చేరిందని వైద్యులు తెలిపారు. ఇయర్‌ఫోన్ అతి వినియోగం వినికిడి శక్తిని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
News November 8, 2025
నెల్లూరు: 15 నుంచి నీరు విడుదల

నెల్లూరు జిల్లా రైతులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల నుంచి ఈనెల 15న నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. నెల్లూరులో ఇవాళ జరిగిన IAB సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రబీ సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు సైతం సోమశిల నుంచి నీరిస్తామని స్పష్టం చేశారు.


