News December 30, 2024

విజయవాడలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక 

image

కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 

Similar News

News January 1, 2025

గన్నవరం: జాతీయ పోటీలకు ఎంపికైన చిన్మయి

image

రాష్ట్రస్థాయి ఖురాష్ క్రీడల్లో అండర్-17 బాలికల 63 కేజీల విభాగంలో గన్నవరానికి చెందిన చిన్మయ్ బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎన్నికయింది. జనవరి 2వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో జరిగే జాతీయ పోటీలకు కృష్ణా జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక బాలిక మానికొండ సాయిసత్య చిన్మయి అని పీఈటీ నాగరాజు తెలిపారు. చదువుతోపాటు క్రీడల్లో కూడా తన ప్రతిభను ప్రదర్శిస్తున్న చిన్మయ్‌ని పలువురు అభినందించారు.

News January 1, 2025

విజయవాడ: ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్య

image

బీఫార్మసీ చదువుతున్న బాలిక మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సింగినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందని సీఐ వెంకటేశ్వర్ల నాయక్ తెలిపారు. పోలీసుల కథనం.. సింగినగర్‌కి చెందిన విద్యార్థిని చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News January 1, 2025

ప్రజలు సంతోషంగా జీవించాలి: కృష్ణా ఎస్పీ 

image

కృష్ణా జిల్లా ప్రజలందరికీ ఎస్పీ ఆర్.గంగాధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేళ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అందరికీ ఆనందాన్ని పంచే కొత్త సంవత్సర ఆగమన వేళ ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్నారు.