News January 11, 2025
విజయవాడలో పుస్తకాలు కొన్న పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియుడైన పవన్ విజయవాడ బుక్ ఫెయిర్‌ను శనివారం ఉదయం సందర్శించారు. మాములుగా ఐతే మధ్యాహ్నం నుంచి పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుంది. కానీ పవన్ కోసం ఉదయం రెండు గంటల పాటు స్టాల్స్‌ను ఓపెన్ చేసి ఉంచారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్‌లో పుస్తకాలను పరిశీలించారు.
Similar News
News January 11, 2025
విజయవాడ మీదుగా అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లు
ప్రయాణికుల సౌలభ్యం మేరకు చర్లపల్లి(CHZ)- విశాఖపట్నం(VSKP) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08538 CHZ- VSKP రైలును ఈ నెల 12,16,17 తేదీలలో, నం.08537 VSKP- CHZ రైలును ఈ నెల 15, 16న నడుపుతామని, ఈ రైళ్లలో అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయన్నారు.
News January 11, 2025
వందే భారత్ సీటింగ్ సామర్థ్యం పెంచిన రైల్వే అధికారులు
విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ సీటింగ్ సామర్థ్యాన్ని పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈనెల 13 నుంచి నం.20708, 20707 వందే భారత్ రైళ్లు 16కోచ్‌లతో నడుస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఛైర్ కార్ కోచ్‌లను 7 నుంచి 14కి పెంచామని, తద్వారా 530గా ఉన్న ఈ రైళ్ల సీటింగ్ సామర్థ్యం 1,128కి చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
News January 11, 2025
విజయవాడలో పవన్ కళ్యాణ్ పర్యటన
విజయవాడ నగరంలో శనివారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. స్థానిక పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా తిలకించారు. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పవన్ పరిశీలించారు. పలు రకాల పుస్తకాలను స్వయంగా ఆయన పర్యవేక్షణ చేశారు. అనంతరం నిర్వహకులు పలు పుస్తకాలను పవన్‌కు అందించి వాటి విశిష్టతను వివరించారు.