News August 25, 2025
విజయవాడలో పోలీసుల సైక్లింగ్ ర్యాలీ

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ‘సండేస్ ఆన్ సైకిల్ విత్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్’ పేరుతో సైకిల్ ర్యాలీ జరిగింది. వ్యాస్ కాంప్లెక్స్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీని డీసీపీ ఎస్.వి.డి. ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సంతోషకరమైన జీవనశైలి లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News August 25, 2025
అలాంటి కేబుల్స్ తొలగించొచ్చు: హైకోర్టు

TG: హైదరాబాద్‌లో స్తంభాలపై అనుమతి లేని కేబుల్స్ <<17483930>>తొలగించవచ్చని <<>>హైకోర్టు పేర్కొంది. కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను GHMC, విద్యుత్ శాఖ తొలగిస్తుండటంపై ఎయిర్‌టెల్ హైకోర్టును ఆశ్రయించింది. అనుమతి తీసుకున్న వాటిని కూడా తొలగిస్తున్నారని ఆ సంస్థ కోర్టుకు వివరించగా అనుమతుల వివరాలివ్వాలని TGSPDCL లాయర్ ఎయిర్‌టెల్‌ను కోరారు. తదుపరి విచారణను వాయిదా వేసింది.
News August 25, 2025
39 మంది కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతులు.. సీపీ అభినందన

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 39 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి పొందారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వయంగా వారికి ఉద్యోగోన్నతుల చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, సేవాస్ఫూర్తికి గుర్తింపుగా ఈ పదోన్నతి లభించిందని అన్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
News August 25, 2025
వైద్యో నారాయణో హరి.. ఈయన వారికి దేవుడే!

వైద్యం వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో బెంగళూరు సమీపంలో ఉండే బెగుర్ గ్రామంలో 50+ఏళ్లుగా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు డాక్టర్ రమణా రావు. 1973లో కొద్దిమంది రోగులతో ప్రారంభమైన ఆయన సేవలు ప్రతి ఆదివారం వేల మందికి ఆశాదీపంగా మారాయి. ఎలాంటి రుసుము తీసుకోకుండా పేదలకు వైద్యం అందిస్తున్నారు. వర్షాలు, అనారోగ్యం, కరోనా వంటివి కూడా ఆయన సేవలను ఆపలేకపోయాయి. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ‘పద్మశ్రీ’తో సత్కరించింది.