News February 23, 2026
విజయవాడలో ప్రజాప్రతినిధుల మధ్య క్రీడా పోరు..!

ఇందిరాగాంధీ స్టేడియంలో MLA, MLCలకు ఈ నెల 24 నుంచి 3 రోజులపాటు పలు క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. పరుగు పందెం, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, టెన్నికాయిట్, త్రో బాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్, షాట్‌పుట్, క్యారమ్స్, క్రికెట్, పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు మ్యూజికల్ ఛైర్ పోటీలు ఉంటాయన్నారు.
Similar News
News February 26, 2026
కాజీపేటలో కల్తీ ఐస్ క్రీం స్వాధీనం

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురిలో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్‌క్రీంలతో పాటు గడువు తీరిన రూ.60,400 విలువలైన 12 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.
News February 26, 2026
చీకటి గుహలో చైతూ వేట.. ‘వృషకర్మ’ క్రేజీ అప్‌డేట్

నాగచైతన్య హీరోగా వస్తున్న మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్ మార్చి 5న విడుదల కానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ ట్రెజర్ హంటర్‌గా కనిపిస్తున్నారు. బ్రహ్మగిరి పర్వతాల్లో నిధి అన్వేషణ, అక్కడి మార్మిక ప్రపంచం చుట్టూ ఈ కథ సాగుతుంది. తాజా పోస్టర్‌లో చైతూ సీరియస్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.
News February 26, 2026
సిద్దిపేట: 3,887 ఎకరాల్లో పంట నష్టం

సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు 40 గ్రామాల్లోని 1,998 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 3,887 ఎకరాల్లో మొక్కజొన్న(2,356 ఎకరాలు), సన్‌ఫ్లవర్(1,531 ఎకరాలు) పంటలు దెబ్బతిన్నాయి. తొగుట మండలంలో డీఏవో స్వరూప రాణి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పించి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాధితులను ఆదుకుంటామని ఆమె రైతులకు హామీ ఇచ్చారు.


