News February 4, 2025

విజయవాడలో ప్రమాదం.. వ్యక్తి మృతి

image

విజయవాడలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. కృష్ణలంక పోలీసులు తెలిపిన సమాచారం మేరకు విజయవాడకు చెందిన కొప్పుల భరద్వాజ్ హోటల్ మేనేజ్మెంట్ సీట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో బెంజ్ సర్కిల్ వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 30, 2025

జగిత్యాల: జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ జి.సుజాత బాధ్యతలు

image

జగిత్యాల జిల్లా నూతన వైద్యారోగ్యశాఖ అధికారిగా డాక్టర్ సుజాత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది నూతన DMHOగా వచ్చిన డాక్టర్ సుజాతకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్‌కి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డా.ఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

News December 30, 2025

రేపు రాత్రి దద్దరిల్లనున్న హైదరాబాద్

image

డిసెంబర్ 31ST.. ఈవెంట్లు, చిల్ మూమెంట్ల నైట్ ఇది. సిటీలో యువత పెద్ద ఎత్తున ప్లాన్‌ వేసుకుంటోంది. పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు సాయంత్రం నుంచే కళకళలాడనున్నాయి. కొందరు పబ్లిక్ స్పాట్‌లకు ప్రిఫరెన్స్ ఇస్తుంటే.. మరి కొందరు ఫ్యామిలీతో కలిసి 31ST దావత్‌‌కు తమ ఇళ్లనే వేదిక చేసుకుంటున్నారు. మార్కెట్‌లోని DJ షాపుల్లో డాన్స్‌ ఫ్లోర్లు, స్పీకర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. రేపు రచ్చ.. రచ్చే.

News December 30, 2025

రాయికల్‌లో యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

రోడ్డుకు ఇరువైపులా ఉన్న రేయిలింగ్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన రాయికల్ మండలంలోని భూపతిపూర్ ఎక్స్ రోడ్ వద్ద సోమవారం జరిగింది. చింతలూరుకు చెందిన భూమేష్(22), దినేష్(18) బైకుపై వెళ్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న భూమేష్ రోడ్డు పక్కనున్న రేయిలింగ్‌ను గుద్దాడు. దీంతో బండి స్కిడై భూమేష్ మృతి చెందాడు. దినేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.