News April 12, 2025
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్

ప్రకాశ్ నగర్ సమీపంలోని శాంతినగర్ వద్ద శనివారం బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడంతో ఆకుల గణేశ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. డబ్బులు అడుగగా గణేశ్ లేవని చెప్పడంతో దుండుగులు అతడిపై బ్లేడుతో, పక్కనున్న వారిపై కర్రలతో దాడి చేశారు. గాయాలతో పడి ఉన్న గణేశ్ను 108 వాహనంలో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 5, 2025
సూర్యాపేట: శ్రీనివాస్ మృతి.. రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి

మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుర్రి శ్రీనివాస్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసందే. ఈరోజు నకిరేకల్ ప్రభుత్వ వైద్యశాలలో ఆయన మృతదేహానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. ఇద్దరు కూతుళ్లు ఉన్న శ్రీనివాస్ కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10లక్షలు ప్రకటించారు. శ్రీనివాస్ భార్యకు ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
News July 5, 2025
ఈ నెల 15, 16 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు

AP: ఈ నెల 15, 16 తేదీల్లో తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజుల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే 14 ,15 తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే సిఫారసులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.
News July 5, 2025
ఈ శతాబ్దపు అత్యుత్తమ మూవీ ‘పారాసైట్’: న్యూయార్క్ టైమ్స్

ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ చిత్రంగా కొరియన్ మూవీ ‘పారాసైట్’ నిలిచింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన 21వ శతాబ్దంలోని టాప్-100 చిత్రాల్లో తొలి స్థానం దక్కించుకుంది. మూన్ లైట్, డార్క్ నైట్, వాల్-ఈ వంటి చిత్రాలతో పోటీ పడటం గమనార్హం. 2019లో రిలీజైన ‘పారాసైట్’కు నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం విభాగంలో అకాడమీ అవార్డు పొందిన నాన్-ఇంగ్లిష్ మూవీ ఇదే. మీరు ఈ మూవీ చూశారా?