News February 7, 2025

విజయవాడలో భారీ దొంగతనం

image

విజయవాడ శివారు ఎనికేపాడులో భారీ దొంగతనం జరిగింది. పటమట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎనికేపాడులోని ఐఫోన్ గోడౌన్‌ రేకు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు రూ.2.50కోట్ల విలువైన 372 ఐఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. 

Similar News

News February 7, 2025

సంగారెడ్డి: పది విద్యార్థులకు అల్పాహారం నిధులు విడుదల

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం నిధులు విడుదల చేసిందని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున రోజు సాయంత్రం అల్పాహారం అందించేందుకు విద్యార్థికి రూ.15 చొప్పున జిల్లాలో 7,757 మంది విద్యార్థులకు 38 రోజులకు గాను రూ.44,21,490 ను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు.

News February 7, 2025

సీఎంతో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047- విజన్ డాక్యుమెంట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.

News February 7, 2025

గుంటూరు: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీ ఫార్మసీ చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్(సప్లిమెంటరీ) థియరీ పరీక్షలను ఈనెల 18, 20, 22, 24, 27, మార్చి 1వ తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగ సిబ్బంది తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు. 

error: Content is protected !!