News April 2, 2025
విజయవాడలో మహిళ అనుమానాస్పద మృతి

విజయవాడ ఆటో నగర్‌లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. లక్ష్మి, మహంకాళి దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. లక్మికి మహంకాలి నాలుగో భర్త. చిత్తు కాగితాలు ఏరగా వచ్చిన డబ్బుతో మద్యం తాగుతుంటారు. మంగళవారం లక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే భర్త మహంకాళి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
Similar News
News April 3, 2025
మోదీ నాకు గొప్ప స్నేహితుడే కానీ..: ట్రంప్

పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన ట్రంప్.. PM మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ నాకు గొప్ప స్నేహితుడు. కానీ భారత్ మమ్మల్ని సరిగా చూసుకోవడం లేదు. మాపై 52 శాతం టారిఫ్ విధిస్తోంది. మేము ఇండియాపై 26% సుంకం విధిస్తున్నాం’ అని చెప్పారు. సుంకాల ప్రకటనతో అమెరికాకు కంపెనీలు తిరిగి వస్తాయని, పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ తెలిపారు. US మార్కెట్లో పోటీతత్వం పెరిగి వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు.
News April 3, 2025
సత్యవేడు MLAపై TDP అధిష్ఠానానికి ఫిర్యాదు

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి టీడీపీ నాయకులు షాక్ ఇచ్చారు. ఆయన తీరుతో పార్టీ నష్టపోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తూ తమను అణగదొక్కుతున్నారని వాపోయారు. కొత్త ఇన్‌ఛార్జ్‌ను ప్రకటిస్తేనే అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే హేమలతకు సత్యవేడు బాధ్యతలు అప్పగించాలని పలువురు కోరినట్లు సమాచారం.
News April 3, 2025
అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పథకంపై సంబంధిత అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.