News February 20, 2026
విజయవాడలో మిస్సైన పిల్లలు గుజరాత్‌లో..!

విజయవాడ భవానీపురంలో <<19188253>>మిస్సైన ఇద్దరు పిల్లల కేసు<<>> సుఖాంతమైంది. ట్యూషన్‌కు వెళ్లకుండా ఇంట్లోని నగదు తీసుకుని పారిపోయిన మేరారామ్ (12), ఉమారామ్ (13) ఆచూకీ లభ్యమైంది. గురువారం విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిన చిన్నారులు, అక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News February 21, 2026
ఖమ్మం: యూట్యూబర్ మృతి.. దోస్తులే హంతకులా..?

ఈనెల 14న <<19137879>>పాలేరు జలాశయం<<>>లో కారు దూసుకెళ్లి ప్రముఖ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని స్నేహితులే ఆయనను హతమార్చినట్లు తెలుస్తోంది. మొదట ప్రమాదమని భావించిన పోలీసులు మృతదేహంపై గాయాలు ఉండటంతో మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో స్నేహితులే హతమార్చినట్లు సమాచారం. త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
News February 21, 2026
ఖమ్మం: రైతులకు ALERT.. 27 వరకు విక్రయాలు

ఖమ్మం జిల్లాలో 2025-26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) పత్తి కొనుగోలు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ గడువు వరకు కొనుగోళ్లు జరుగుతాయి. రైతులు తమ పత్తిని ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని విక్రయించుకోవాలని అధికారులు సూచించారు.
News February 21, 2026
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 349 అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. BSF-108, CRPF-106, ITBP-12, SSB-53, CISF-70 ఉద్యోగాలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 20-25 ఏళ్ల వయసు ఉన్న వారు మార్చి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జులై 19న రాత పరీక్ష ఉంటుంది. వెబ్‌సైట్: https://upsconline.nic.in


