News January 9, 2026
విజయవాడలో ముగ్గురు హెడ్ కానిస్టేబుల్‌లకు ఉద్యోగోన్నతి

విజయవాడలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు హెడ్ కానిస్టేబుల్‌లకు సర్వీసు ప్రతిపాదన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉద్యోగోన్నతులు కల్పించి సీపీ రాజశేఖర్ బాబు బదిలీ చేశారు. ఏఎస్ఐలు ఏలేశ్వరం మెహర్ బాబు, ఉమామహేశ్వరరావు, మురళీకృష్ణ ఈ సందర్భంగా సీపీను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ అభినందనలు తెలిపారు.
Similar News
News February 19, 2026
చిత్తూరు: పేరుకే ఉచిత ఇసుక.. కానీ?

ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా జిల్లాలో ఎక్కడా ప్రజలకు ఉచితంగా <<19185159>>ఇసుక<<>> అందడం లేదట. ఇసుకను 5 KM పరిధిలో సరఫరా చేయడానికి కొందరు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రక్కుల ద్వారా రూ.20 వేలు చెల్లించాల్సిందే. దూరం పెరిగే కొద్దీ ధర మరింత పెరుగుతుంది. తమిళనాడులో నిబంధనల మేరకు అక్కడ ఇసుక అక్రమ రవాణా అసాధ్యం. దీంతో కొందరు ఇక్కడి నుంచే ఇసుకను చెన్నై, వెల్లూరు ప్రాంతాలకు తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.
News February 19, 2026
AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు

బీబీనగర్‌లోని AIIMS 3పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, BSc(నర్సింగ్), GNM, BSc(రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్/EMT) అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు నెలకు రూ.30K, నర్సింగ్ ఆఫీసర్, టెక్నీషియన్‌కు రూ.40K చెల్లిస్తారు. సైట్:aiimsbibinagar.edu.in
News February 19, 2026
క్యాబేజీ సాగుకు అనుకూల నేలలు, విత్తన మోతాదు

కూరగాయల్లో అధిక ఆదాయం ఇచ్చే పంటల్లో క్యాబేజీ ఒకటి. కొద్దిపాటి నీటి సౌకర్యం ఉన్న భూముల్లో కూడా ఈ పంటను సాగుచేసి మంచి లాభాలు పొందవచ్చు. ఇసుకతో కూడిన బంక నేలలు, సారవంతమైన ఒండ్రు నేలలు ఈ పంటకు అనుకూలం. ఇక విత్తన మోతాదుకు విషయానికొస్తే ఎకరానికి సూటి రకాలు 300 గ్రా., హైబ్రిడ్ రకాలు 100-150 గ్రా. విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ను కలిపి విత్తన శుద్ధిచేయాలి.


