News December 10, 2025

విజయవాడలో మెడికల్ క్యాంపుల సిద్ధం

image

భవాని దీక్షాపరుల ఆరోగ్య సంరక్షణ కోసం అవసరమైన మందులు, వైద్యులతో కలిసి మొత్తం 28 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. రాజగోపురం, ఓం టర్నింగ్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్, మహామండపం, కనకదుర్గనగర్, దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, సీతమ్మవారి పాదాలు, రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్‌లో శిబిరాలు ఉన్నాయి. దేవస్థానం అంబులెన్సులకు అదనంగా కొండపైన, కొండ దిగువన, గిరిప్రదక్షిణ మార్గంలో 10 అంబులెన్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

Similar News

News December 13, 2025

BHPL: ఒక్క రోజే గడువు.. ప్రలోభాలతో ఓట్లకు ఎర!

image

BHPL(D)లో 2వ విడత పోలింగ్‌కు ఒక్క రోజే గడువుంది. 79 పంచాయతీలకు, 547 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు, మద్యం మాంసంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఓటు కోసం సర్పంచ్, వార్డుల అభ్యర్థులు డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతండగా.. మహిళలను ఆకర్షించేందుకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

News December 13, 2025

డిసెంబర్ 13: చరిత్రలో ఈ రోజు

image

1952: దక్షిణ భారత నటి లక్ష్మి జననం
1955: కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ జననం
1960: విక్టరీ వెంకటేశ్(ఫొటోలో) జననం
1961: భారత దిగ్గజ క్రికెటర్ అలీఖాన్ పటౌడీ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రోజు
1986: హిందీ నటి స్మితా పాటిల్ మరణం
1990: హీరోయిన్ రెజీనా జననం
2001: భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన రోజు

News December 13, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.