News February 19, 2026
విజయవాడలో మెడికో మృతి.. వీడని మిస్టరీ..!

విజయవాడ GGHలో ఈనెల 5న <<19055357>>మెడికో దీపిక<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. కుమార్తె చనిపోయి రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదని తండ్రి కోదండరామిరెడ్డి ఆరోపిస్తున్నారు. దీపిక ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను మాచవరం పోలీసులు ఓపెన్ చేశారని, FIR, FSL నంబర్ అడిగితే ఇవ్వడంలేదంటున్నారు. ఆమె అందరూ ఉండే ఎమర్జెన్సీ వార్డులో చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ వివరాలను త్వరగా వెల్లడించాలన్నారు.
Similar News
News February 21, 2026
బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేసుకోవాలి: ఇందిర

BHPL: పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కావాలంటే విద్యార్ధుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర సూచించారు. పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న బీసీ, ఈబీసీ విద్యార్ధుల ఖాతాల్లో ఉపకారవేతనాల మొత్తం జమ కావాలంటే బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్‌తో సీడింగ్ చేయాలని సూచించారు.
News February 21, 2026
అభిషేక్ ఫామ్‌పై కెప్టెన్ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

T20WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ అభిషేక్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కెప్టెన్ సూర్య స్పందించారు. అభి గురించి ఆందోళన పడుతున్నవారి గురించి తాను ఆందోళన పడుతున్నట్లు చమత్కరించారు. అతడిని ఎదుర్కోబోతున్న ప్రత్యర్థి జట్లపై మరింత ఆందోళనగా ఉందన్నారు. అభి బ్యాట్‌తో ఏం చేస్తాడో గతేడాది చూశామని, ప్రస్తుతం మద్దతుగా నిలవాల్సిన టైమ్ అని చెప్పారు. దీంతో రేపటి మ్యాచ్‌లో అభిషేక్ ఆడటం కన్ఫర్మ్ అయినట్లే.
News February 21, 2026
మహిళలకు నెలకు రూ.25,000.. క్లారిటీ

కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్‌ను తీసుకొచ్చిందంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు జీతం వస్తుందనేది అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను చూసి మోసపోవద్దని పౌరులకు సూచించింది. ఫేక్ న్యూస్, వీడియో, ఫొటో కనిపిస్తే factcheck@pib.gov.inకు పంపాలని కోరింది.


