News December 30, 2024

విజయవాడలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

విజ‌య‌వాడ న‌గ‌ర అవ‌సరాల‌కు త‌గ్గ‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌నుల‌పై దృష్టి పెట్టింద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే రామ్మోహ‌న్ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో స‌మ‌ష్టి కృషితో ర‌హ‌దారుల‌తో పాటు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషిచేస్తున్న‌ట్లు సోమ‌వారం న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో వారు ప‌ర్య‌టించారు. అనంతరం ఆయా కాలనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై చర్చించారు.

Similar News

News April 25, 2025

తేలప్రోలు: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

image

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు. 

News April 25, 2025

కృష్ణా: ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త.!

image

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.8°, గన్నవరం 41.2°, గుడివాడ 40.2°, కంకిపాడు 40.7°, నందివాడ 40.1°, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 40.9°, పెదపారుపూడి 40.3°, తోట్లవల్లూరు 40°, ఉయ్యూరు 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News April 25, 2025

మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

error: Content is protected !!