News January 25, 2025
విజయవాడలో మ్యూజికల్ నైట్ ఏర్పాట్లు

విజయవాడలో ఇఫ్టోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ స్టేడియంలో ఫిబ్రవరి 15న నిర్వహించే ఈ మ్యూజికల్ నైట్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొననున్నారు. ఈ ఏర్పాట్లను ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శుక్రవారం సీపీ రాజశేఖర్ బాబుతో కలిసి పరిశీలించారు.
Similar News
News September 14, 2025
ములుగు సమగ్ర స్వరూపంపై పుస్తకం రూపకల్పన

తెలంగాణా సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా సమగ్ర స్వరూపం అనే పుస్తకాన్ని వెలువరిస్తుందని నిర్వాహకులు తెలిపారు. జిల్లా చరిత్ర, నైసర్గిక స్వరూపం, నీటిపారుదల, వ్యవసాయం, పర్యాటక, విద్యా, రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక, కళా రంగాలు, ఇతర అంశాలపై రచయితల నుంచి వ్యాసాలు ఆహ్వానిస్తున్నామని, అమ్మిన శ్రీనివాసరాజు 7729883223, కె. వెంకటరమణ 9849905900లకు వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు.
News September 14, 2025
HYD: ఈ ఫార్ములా కేస్.. విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి బాల్

గత ప్రభుత్వం HYDలో నిర్వహించిన ఈ ఫార్ములా కార్ రేసులో భారీ అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తదుపరి విచారణకు అనుమతివ్వాలని కోరింది. అయితే ప్రభుత్వం ఈ రిపోర్టును విజిలెన్స్ కమిషన్‌కు పంపి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయం కోరింది. విజిలెన్స్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసుపై చర్యలు తీసుకోనుంది.
News September 14, 2025
చిన్నారుల జీవితాల్లో ఆశలు కల్పిస్తున్న నిమ్స్

గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్‌లో నేటి నుంచి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. బ్రిటన్ వైద్యులు ఏటా సెప్టెంబరులో ఈ చికిత్సలు చేస్తారు. ఈనెల 20వ తేదీ వరకు క్లిష్టమైన ఆపరేషన్లను చేస్తారు. నిమ్స్ కార్డియోథొరాసిక్ డాక్టర్ల సహకారంతో ఈ వైద్యం అందించనున్నారని కార్డియోథొరాసిక్ హెడ్ డా.అమరేశ్వర్ రావు తెలిపారు.