News December 28, 2024

విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్

image

విజయవాడలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ కటౌట్ నిర్మించారు. ఈ కటౌట్ ను రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గేమ్ చేజింగ్ మూవీ టీం హాజరై ఆవిష్కరించనున్నారు. కటౌట్ ఆవిష్కరణ అనంతరం హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తమ అభిమాన కథానాయకుడు భారీ కటౌట్ ఏర్పాటు చేయటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 29, 2024

విజయవాడ: నేడు రామ్‌చరణ్‌ భారీ కటౌట్‌ ఆవిష్కరణ

image

విజయవాడ వజ్రా గ్రౌండ్స్‌లో ఈరోజు గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్‌ కటౌట్‌ను ఆవిష్కరించబోతుంది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో రామ్ చరణ్ కటౌట్‌కి పూలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరుకానుంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా తరలి రానున్నారు. కాగా సుమారు 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్‌ సినిమాలో రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు.

News December 29, 2024

విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

కుంభమేళా సందర్భంగా విజయవాడ మీదుగా గుంటూరు, గయ(బీహార్) మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07719 గుంటూరు- గయ రైలును జనవరి 25న, నం.07720 గయ- గుంటూరు రైలును జనవరి 27న నడుపుతున్నామని తెలిపింది. నం.07719 రైలు 25న మధ్యాహ్నం 3.30కి విజయవాడ చేరుకుంటుందని, నం.07720 రైలు గయలో 27న బయలుదేరి 29న ఉదయం 1.30కి విజయవాడ వస్తుందన్నారు.

News December 29, 2024

విజయవాడ: ఏలూరు – తాడేపల్లిగూడెం వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్

image

గన్నవరం – ముస్తాబాద మధ్య ట్రాక్ పనులు జరుగుతున్నందున రైలు నం.13351 ధన్‌బాద్ – అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్గాన్ని మార్చినట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈ ట్రైన్‌ ఈ నెల 30, 31, జనవరి 2, 3, 4 తేదీలలో ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా గాక విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ గుండా నిడదవోలు చేరుతుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని, ప్రయాణికులు గమనించాలని సూచించారు.