News December 18, 2025
విజయవాడలో రూ.150 కోట్ల ప్రాపర్టీ కాజేసే కుట్ర: జగన్

విజయవాడ జోగినగర్లో ఇళ్ల కూల్చివేతపై మాజీ సీఎం జగన్ స్పందించారు. 25 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్న 42 కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. దాదాపు రూ.150 కోట్ల విలువైన భూమి విషయంలో ప్రైవేట్ వ్యక్తులకు సానుకూలంగా ఉండేలా వ్యవహరించారని ఆరోపించారు. సుప్రీంలో కేసు ఉండగానే ఇళ్ల కూల్చివేత దుర్మార్గమన్నారు. ఈ వివాదంలో ఎంపీ కేశినేని చిన్ని, జనసేన లోకల్ కార్పొరేటర్ పాత్రపై విచారణ జరిపి.. బాధితులకు న్యాయం చేయాలన్నారు.
Similar News
News December 19, 2025
ఇంట్లో వాళ్లతో పోటీ పడటం కష్టంగా ఉంది: లోకేశ్

AP: ఎన్నికల్లో పోటీ చేయడం కంటే తనకు ఇంట్లో వాళ్లతో పోటీ పడటం కష్టంగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘‘తండ్రి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. తల్లికి ‘గోల్డెన్ పీకాక్ అవార్డు’ వచ్చింది. భార్య ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజిజెస్’ అవార్డ్ గెలిచింది’’ అని ట్వీట్ చేశారు. తన కుమరుడు దేవాన్ష్ కూడా చెస్ ఛాంపియన్ అని పేర్కొన్నారు. ఈ పోటీ తరతరాలుగా కొనసాగుతూనే ఉందని చెప్పారు.
News December 19, 2025
నంద్యాల: ఫొటోల మార్ఫింగ్.. ఇద్దరు మహిళల అరెస్ట్

కోవెలకుంట్ల, సంజామల, రేవనూరు, ఆళ్లగడ్డ పరిధిలోని పోలీసు అధికారుల ఫొటోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.రమేశ్ బాబు తెలిపారు. ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న వారి సమాచారం తెలియడంతో బందెల స్పందన, బందెల మారతమ్మను కోవెలకుంట్లలో అరెస్ట్ చేశామన్నారు. మార్ఫింగ్‌కు వాడుతున్న రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
News December 19, 2025
SDPT: పంచాయతీ ఎన్నికల కిక్కు.. రూ.69.95 కోట్ల అమ్మకాలు

ఓ వైపు పంచాయతీ ఎన్నికలు.. మరోవైపు కొత్త వైన్ షాపుల స్టాక్ కొనుగోళ్లతో జిల్లాలో లిక్కర్ అమ్మకాలు భారీగా కొనసాగాయి. మూడు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో మద్యం విక్రయాలు మత్తెక్కించాయి. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రూ.69.95 కోట్ల విలువ 74,678 కేసుల లిక్కర్,79,828 కేసుల బీర్ల విక్రయాలు సాగాయి. ఈ వారం రోజులపాటు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మద్యంపై భారీగా ఖర్చు చేసినట్టు చర్చించుకుంటున్నారు.


