News April 2, 2025
విజయవాడలో రూ.252 కోట్ల పన్ను వసూలు

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.252 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు బుధవారం వీఎంసీ వెల్లడించింది. నగరపాలక సంస్థకు గతంలో ఎన్నడూ లేనంతగా పన్నులు వసూలైనట్లు మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అనంతరం వీఎంసీ రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ సత్యవతిని మేయర్ అభినందించారు.
Similar News
News February 9, 2026
ఆచమనం: పాటించాల్సిన నియమాలు!

ఆచమనం అంటే తినేముందు నీటిని సేవించడం. ఇది మనస్సును, శరీరాన్ని పవిత్రం చేస్తుంది. ఎడమచేతితో ఉద్ధరణెతో నీటిని తీసుకోవాలి. కుడిచేతి అరచేతిని ‘గోకర్ణాకృతి’లో ఉంచి చప్పుడు కాకుండా జలాన్ని స్వీకరించాలి. ఈ సమయంలో జలం మీసాలకు, గడ్డానికి తగలకూడదు. కేశవ, నారాయణ, మాధవ నామాలతో చేసే ఈ ప్రక్రియ చేయాలి. తద్వారా పంచేంద్రియాలు శుద్ధి చెందుతాయి. ఆచమనంతో ఏకాగ్రత, సాత్విక శక్తి పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
News February 9, 2026
ఊట్కూర్: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌లో ప్రశాంత్‌కు కాంస్య పతకం

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ రెజ్లింగ్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-15 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రశాంత్ కాంస్య పతకం సాధించాడు. ఈ విషయాన్ని పీడీ సాయినాథ్ తెలిపారు. ప్రశాంత్ సాధించిన ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
News February 9, 2026
మున్సిపోల్: సాయంకాలానికి అంతా SILENT

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, BJP నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, BRS నుంచి కేటీఆర్, హరీశ్ రావు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. చివరి రోజు కావడంతో ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. మొత్తం 2,982 వార్డులకు 11న పోలింగ్ జరగనుండగా 13 కౌంటింగ్ నిర్వహించనున్నారు.


