News April 14, 2025

విజయవాడలో రోప్ వే.. ఈసారి కన్ఫామ్

image

భవానీ ఐలాండ్‌కు రోప్‌వే కల సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన భౌగోళిక, ఆధ్యాత్మిక అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి హరిత బర్మా పార్క్ నుంచి నేరుగా భవానీ ద్వీపం వరకూ 0.88 కి.మీ దూరంలో రోప్‌వే ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును PPP విధానంలో అప్పగించనున్నారు.

Similar News

News April 15, 2025

మచిలీపట్నం: రెవెన్యూ సమస్యలపై దృష్టిసారించాలి – కలెక్టర్

image

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో రెవెన్యూ సమస్యలపై జిల్లా స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల అలినేషన్, 22Aలో ఉన్న ప్రైవేటు భూములు, భూముల అసైన్మెంట్, ఇనాం భూములు, ROR & వెబ్ ల్యాండ్, రీసర్వే తదితర రెవెన్యూ అంశాలలో తలెత్తుతున్న సమస్యలను చర్చించారు.

News April 15, 2025

నేటి నుంచి సముద్రంలో వేట నిషేధం.!

image

నేటి నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కోడూరు మండల ఎఫ్‌డీఓ డి. స్వామివారి రావు ఒక ప్రకటనలో తెలిపారు. 15వ తేది నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు యాంత్రిక ఇంజిన్ నావలలో వేట చేయుట నిషేధించినట్లు చెప్పారు. కోడూరు మండలం పాలకాయతిప్ప లాండింగ్ సెంటర్‌లోని మర పడవల యజమానులు, షరతులు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు బోటు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. 

News April 15, 2025

నేడు విచారణకు రానున్న వంశీ బెయిల్ పిటిషన్

image

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. విజయవాడ SC, ST కోర్టు న్యాయ అధికారి హిమబిందు గత శుక్రవారం ఈ పిటిషన్ విచారించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా సత్యవర్ధన్ అనే యువకుడిని అపహరించిన కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే.

error: Content is protected !!