News February 24, 2026
విజయవాడలో లూజ్ మిల్క్.. అధికారుల దాడులు

రాజమండ్రిలో ఇటీవల జరిగిన దుర్ఘటన దృష్ట్యా NTR కలెక్టర్ లక్ష్మీశ ఆదేశానుసారం విజయవాడలో లూజ్ మిల్క్‌ను విక్రయిస్తున్న వివిధ అవుట్ లెట్స్‌పై అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. కృష్ణలంక, పంటకాలువ రోడ్డు, గురునానక్ కాలనీ తదితర ప్రాంతల్లో తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు. పాల కల్తీపై అనుమానం వస్తే ఫుడ్ సేఫ్టీ లేదా పశుసంవర్ధక శాఖకు సమాచారం అందించాలన్నారు.
Similar News
News February 25, 2026
‘జెన్ జీ’ వల్ల రూ.76లక్షల కోట్లు నష్టం!

ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ పరిశ్రమ నాలుగేళ్లలో 839 బిలియన్ డాలర్ల(రూ.76లక్షల కోట్లు) మార్కెట్ విలువను కోల్పోయింది. దీనికి కారణం <<17942790>>‘జెన్ జీ’<<>> యువతలో వస్తున్న జీవనశైలి మార్పులేనని పలు నివేదికలు చెబుతున్నాయి. మునుపటి తరాలతో పోలిస్తే జెన్ జీలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తూ మద్యానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆల్కహాల్ కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతోంది.
News February 25, 2026
నరసాపురం: వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

నరసాపురం మండలం వేములదీవి పడమరలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బొమ్మిడి యేసుబాబు(53) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే నరసాపురం తహశీల్దార్ ఐవీవీ సత్య నారాయణ, ఆర్‌ఐ సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News February 25, 2026
చెరకు పంటలో పీక, కాండం తొలుచు పురుగు ప్రభావం

చెరకు నాటిన దగ్గరి నుంచి నరికే వరకు ఈ పురుగులు పైరును ఆశిస్తాయి. బాల్య దశలో పీకపురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా పంటను నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధార చెరకుపై ఎక్కువగా ఉంటుంది. దీని ఉద్ధృతి ఎక్కువైతే పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పురుగుల విషయంలో నిర్లక్ష్యం వద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


