News January 31, 2025

విజయవాడలో వ్యభిచారం.. మహిళ అరెస్ట్

image

వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. సూర్యారావుపేట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు కోదండరామిరెడ్డి వారి వీధిలో ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో గురువారం సాయంత్రం దాడి చేశామన్నారు. ఈ దాడిలో ఓ మహిళను తీసుకొని ఆమె వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిర్వాహకురాలు నాగమణి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Similar News

News February 11, 2026

సంజూ శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్!

image

NZ సిరీస్‌లో ఫామ్ కోల్పోయి T20 WC తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్11లో చోటు కోల్పోయిన సంజూకు గోల్డెన్ ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్ అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఎల్లుండి నమీబియా‌తో జరిగే మ్యాచ్‌లో శాంసన్‌ జట్టులోకి వస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. అందులో రాణిస్తే టీమ్‌లో ప్లేస్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సుందని అంటున్నాయి. అటు సిరాజ్ ప్లేస్‌లో బుమ్రా ఎంట్రీ ఇస్తారని భావిస్తున్నాయి.

News February 11, 2026

సంగారెడ్డి: ‘విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి’

image

విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. పటాన్‌చెరులోని ప్రైవేట్ పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్నామని చెప్పారు. చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు నిర్భయంగా ఎదుర్కోవాలని సూచించారు.

News February 11, 2026

కామారెడ్డి: ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రేపు జరిగే పోలింగ్‌లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఓటు వేసేందుకు వీలుగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వచ్ఛందంగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.