News September 13, 2025

విజయవాడలో స్క్వాష్, బాక్సింగ్ జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-14, అండర్-17 బాల బాలికల బాక్సింగ్, స్క్వాష్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. ఈ పోటీలలో పాల్గొనే క్రీడా కారులు తమ స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సీల్ ఉన్న ఎంట్రీ ఫారంతో ఉదయం 9 గంటల కల్లా హాజరు కావాలని ఎస్టీఎఫ్ కార్యదర్శులు అరుణ, రాంబాబు తెలిపారు.

Similar News

News September 13, 2025

అభివృద్ధి ఓ వైపు.. ఉద్యమం మరో వైపు..!

image

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.150 కోట్లను కేటాయించగా వందరోజుల యాక్షన్ ప్లాన్‌తో పనులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పంటనష్ట పరిహారం వివాదం తెరపైకి వచ్చింది. జాతర సమయంలో పంట నష్ట పోతున్న రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైతాంగ పోరాటాన్ని BRS వెనకుండి నడిపిస్తున్నట్లు సమాచారం.

News September 13, 2025

నిరుద్యోగులను మోసం చేసిన సీఎం: హరీశ్‌రావు

image

TG: గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని BRS నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘జాబ్స్‌ కోసం మంత్రులు, అధికారులు లంచం అడిగారని నిరుద్యోగులు చెబుతున్నారు. తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్‌కి వెళ్లాలనుకోవడం సిగ్గుచేటు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్, ప్రియాంకతో చెప్పించి రేవంత్ మోసం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు.

News September 13, 2025

‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

image

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.