News October 10, 2025
విజయవాడలో స్మార్ట్ వెండింగ్ మార్కెట్

VJA విద్యాధరపురం RTC డిపో సమీపంలో మెప్మా ఆధ్వర్యంలో స్మార్ట్ వెండింగ్ మార్కెట్ తరహా ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఈ తరహా మార్కెట్‌ను ఇప్పటికే నెల్లూరులో ఏర్పాటు చేశారు. పొదుపు మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, ఫుడ్ కోర్టులు, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు మెప్మా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. తొలి విడతలో 40 దుకాణాల ఏర్పాటుకు అనుమతులు కోరినట్లు మెప్మా అధికారులు తెలిపారు.
Similar News
News October 10, 2025
సీబీఐ దర్యాప్తునకు రాజంపేట MP డిమాండ్

ఏపీలో నకిలీ మద్యం రాకెట్‌పై సీబీఐ దర్యాప్తు చేయాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆయన లేఖ రాశారు. వ్యవస్థీకృత అంతర్ రాష్ట్ర నేరంగా కల్తీ మద్యం తయారీ చేస్తున్నారని చెప్పారు. మిథనాల్ వంటి విషపూరిత రసాయనాలతో తయారు చేసిన నకిలీ మద్యం ప్రాణాలకు ముప్పు కలిగిస్తోందని తన లేఖలో పేర్కొన్నారు.
News October 10, 2025
మరియాకు నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్‌కు నిరాశ

2025కి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన పార్లమెంట్ సభ్యురాలు మరియా కొరినా మచాడోను వరించింది. డెమొక్రటిక్ రైట్స్, శాంతి కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వెనిజులాను ఆమె డిక్టేటర్‌షిప్ నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించారు. అటు ఈ ప్రైజ్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నిరాశే మిగిలింది.
News October 10, 2025
ఏ ఒక్క పత్తి రైతూ నష్టపోకుండా చూడాలి: VZM జేసీ

ఏ ఒక్క పత్తి రైతు నష్టపోకుండా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాదవన్ ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జేసీ ఛాంబర్‌లో శుక్రవారం జరిగింది. పత్తి రైతు ఈ-క్రాప్ కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటా రూ. 8,110గా నిర్ణయించిందని, ఈ విషయాన్ని RSKల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.