News December 1, 2024

విజయవాడలో హరిహరవీరమల్లు షూటింగ్‌

image

హీరోయిన్ నిధి అగర్వాల్ విజయవాడలో జరుగుతున్న హరిహరవీరమల్లు షూటింగ్‌లో ఉన్నానని తన ఇన్‌స్టాలో ఆదివారం పోస్ట్ చేశారు. ఈ షూటింగ్‌లో పాల్గొనే నిమిత్తం ఆమె నిన్న విజయవాడ చేరుకున్నట్లు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రానికి MM కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. 

Similar News

News March 14, 2025

ఘంటసాల: బ్రతుకు తెరువు కోసం వస్తే బ్రతుకులు తెల్లారాయి  

image

పొట్టకూటి కోసం కోటి కష్టాలని.. బ్రతుకుదెరువు కోసం ప.గో జిల్లా కాళ్ల మండలం జువ్వలపాలెం గ్రామం నుంచి ఇద్దరు బొలెరో వాహనంలో వచ్చారు. రొయ్య పిల్లలు తీసుకొని చల్లపల్లి మీదుగా స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఘంటసాల (మ) జీలగలగండి వద్ద నిద్రమత్తులో డ్రైవర్ లారీని ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాహనాల్లో చిక్కుకున్న మృతదేహాలు బయటికి తీయడానికి పోలీసులు శ్రమించారు. 

News March 14, 2025

MTM: గవర్నర్‌ని కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం VC

image

కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ రాష్ట్ర గవర్నర్‌, విశ్వవిద్యాలయాల కులపతి అబ్దుల్ నజీర్‌ను రాజ్ భవన్‌లో శుక్రవారం కలిశారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహణకు గవర్నర్ నుంచి అనుమతి కోరారు.

News March 14, 2025

కృష్ణా: రేపు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

image

కృష్ణాజిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్టు సీఈఓ కన్నమ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 7 స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆయా స్థాయీ సంఘ ఛైర్మన్ల అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరుగుతాయని తెలిపారు. 

error: Content is protected !!