News October 27, 2024

విజయవాడలో హోటల్‌కు బాంబు బెదిరింపులు

image

విజయవాడలోని బందర్ రోడ్‌లో గల వివంత హోటల్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన కృష్ణలంక సీఐ నాగరాజు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. అయితే ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అనేది అధికారులు వెల్లడించాల్సి ఉంది.

Similar News

News February 21, 2026

22న గన్నవరంలో జిల్లాస్థాయి జట్ల ఎంపికలు

image

కృష్ణాజిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సీనియర్ స్త్రీ, పురుషుల టెన్నిస్ బాల్ క్రికెట్ జట్లను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారిని వచ్చే నెల 7న సంతనూతలపాడులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి నరేంద్ర బాబు తెలిపారు. మరిన్ని వివరాలకు 94418 12694ను సంప్రదించాలన్నారు.

News February 20, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* విజయవాడలో కూతురి పట్ల తండ్రి అసభ్య ప్రవర్తన
* చంద్రబాబును జైళ్లో వేయాలి: పేర్ని నాని
* విజయవాడలో ప్రమాదం.. ఒకరి మృతి
* పెనమలూరు: KTM పండుకు పీటీ వారెంట్
* బందరులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడ బెంజి సర్కిల్‌లో చీకటి వ్యాపారం

News February 20, 2026

కృష్ణా: నిందితులపై పోలీసుల ఫోకస్..!

image

కృష్ణాజిల్లాలో కరుడుగట్టిన నేరస్తులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. SP విద్యాసాగర్ ఆదేశాల మేరకు నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. హత్యలు, అత్యాచారాలు, ఇతర నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతంగా మారిన వారి పట్ల చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వివరించారు. ఇటువంటి వారికి PT వారెంట్ల జారీకి కూడా వెనుకాడటం లేదని, తాజాగా పెనమలూరు PS పరిథిలోని నిందితుడు KTM పండుకు PT వారెంట్ జారీ చేశారన్నారు.