News March 28, 2025
విజయవాడ: అత్యాచారం కేసులో 20 సంవత్సరాల జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం కేసులు న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపిన సమాచారం మేరకు.. వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ బాలికతో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్(19) అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడి గర్భవతిని చేసి మోసం చేశాడు. విచారించిన న్యాయస్థానం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 30వేల జరిమాన విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.
Similar News
News March 31, 2025
సాటాపూర్ గేట్ వద్ద వడ్ల లారీ బోల్తా

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు.
News March 31, 2025
గుంటూరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

రంజాన్ పర్వదిన సందర్భంగా నేడు PGRS కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.
News March 31, 2025
మంచిర్యాల: సుమంత్ గౌడ్‌కి గ్రూప్-1లో STATE RANK

గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించాడు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలానికి చెందిన సుమంత్ గౌడ్. కాగా, ఈయన గ్రూప్-2, 3, 4లో కూడా ర్యాంకు సాధించాడు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో రాష్ట్రస్థాయిలో 286వ ర్యాంకు, మల్టీజోన్‌లో 126వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం సుమంత్ గౌడ్ GHMCలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.