News January 12, 2025

విజయవాడ: ‘అప్పట్లో అరాచకాలు, ఇప్పుడు నీతులా?’

image

వైసీపీ ప్రభుత్వంలోనే ఇష్టానుసారంగా సంక్రాంతి సంబరాల పేరుతో క్యాసినోలు నిర్వహించిన ఘనత ఆ పార్టీ నేతలకే దక్కిందని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చింతల అనిల్ కుమార్ విమర్శించారు. శనివారం విజయవాడలో తన కార్యాలయంలో అనిల్ వైసీపీపై మండిపడ్డారు. ఆరు నెలల కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో ఆ పార్టీ నేతలు అరాచకాలు సృష్టించి, నేడు నీతులు వల్లించడం దారుణం అన్నారు.

Similar News

News January 11, 2025

కృష్ణా: ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మందికి లబ్ధి

image

ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల కింద రూ.788 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. కాగా ఎన్టీఆర్ జిల్లాలో 605, కృష్ణాలో 508 సచివాలయాల పరిధిలో వేలాదిమందికి ఈ పథకం కింద లబ్ధి అందనుంది. గత ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలలో పీజీ చదివిన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిలిపివేయగా కూటమి ప్రభుత్వం పథకం అమలు చేస్తూ నిధులు విడుదల చేసింది.

News January 11, 2025

విజయవాడ మీదుగా అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లు

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు చర్లపల్లి(CHZ)- విశాఖపట్నం(VSKP) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08538 CHZ- VSKP రైలును ఈ నెల 12,16,17 తేదీలలో, నం.08537 VSKP- CHZ రైలును ఈ నెల 15, 16న నడుపుతామని, ఈ రైళ్లలో అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయన్నారు.

News January 11, 2025

విజయవాడలో పుస్తకాలు కొన్న పవన్ కళ్యాణ్

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియుడైన పవన్ విజయవాడ బుక్ ఫెయిర్‌ను శనివారం ఉదయం సందర్శించారు. మాములుగా ఐతే మధ్యాహ్నం నుంచి పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుంది. కానీ పవన్ కోసం ఉదయం రెండు గంటల పాటు స్టాల్స్‌ను ఓపెన్ చేసి ఉంచారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్‌లో పుస్తకాలను పరిశీలించారు.