News September 16, 2025
విజయవాడ: అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా నరసాపురం(NS)- తిరువణ్ణామలై(TNM) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ మేరకు నం.07219 NS- TNM రైలును OCT 1, 8, 22 & NOV 5, 19, 26న నడుపుతామని, నం.07220 TNM- NS రైలును OCT 2, 9, 23 & NOV 6, 20, 27న నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయన్నారు.
Similar News
News September 16, 2025
పుట్ట మధు ఇంటి ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇంటి ముందు మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెంచికల్ పేట గ్రామంలో సోమవారం స్వర్గీయ శ్రీపాద రావు, మంత్రి శ్రీధర్ బాబుపై పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. అనంతరం పుట్ట మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఇదే క్రమంలో అంబేడ్కర్, శ్రీపాద రావు విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు.
News September 16, 2025
పాక్‌కు అవమానం.. మాట ప్రకారం తప్పుకుంటుందా?

IND vs PAK మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని PCB చేసిన <<17717948>>ఫిర్యాదును<<>> రిజెక్ట్ చేసినట్లు ICC అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామన్న పాక్‌కు ఘోర అవమానం ఎదురైంది. మొన్న గ్రౌండ్లో ప్లేయర్లకు, ఇప్పుడు ఆ దేశ బోర్డుకు భంగపాటు తప్పలేదు. మాట మీద నిలబడి టోర్నీ నుంచి తప్పుకుంటే పాక్‌కు కనీస మర్యాదైనా దక్కుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News September 16, 2025
నెల్లూరు: సాగు నీరు ముందుకెళ్లేది ఎలా?

అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రధాన ఆయకట్టు పంట కాలువల్లో గుర్రపు డెక్క పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో సాగు నీటికి ఆటంకంగా మారుతోంది. దీంతో సీజన్లో ఆయకట్టు పొలాలకు నీరు అందడం లేదు. జాఫర్ సాహెబ్ కాలువ, సర్వేపల్లి కెనాల్, కనుపూరు కెనాల్ పంట కాలువల్లో రబీ ఆరంభానికి ముందే పూడికతీత పనులు చేపట్టాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.