News December 17, 2025
విజయవాడ: ఆర్టీసీ అధికారుల మొద్దు నిద్ర.. ప్రజల ప్రాణాలతో చెలగాటమా!

విజయవాడ బస్టాండ్‌లో బుధవారం జరిగిన ప్రమాదంలో మహిళ <<18595385>>రెండు కాళ్లు ఛిద్రమయ్యాయి<<>>. గతంలోనూ జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. కాగా బస్టాండ్‌లో RTC డ్రైవర్లు అధిక వేగంతో బస్సులు నడుపుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. బస్టాండ్‌లో ఎలాంటి వ్యాపారాలు పెట్టి డబ్బులు సంపాదించాలి, ఏ షాపుని ఎన్ని లక్షలకు అద్దెకి ఇస్తే ఆదాయం వస్తుందన్న ఆలోచన తప్ప, ప్రయాణికుల భద్రతను పట్టించుకోవటం లేదన్నది స్పష్టమవుతోంది.
Similar News
News December 18, 2025
ట్రైన్‌లో రాత్రిపూట ప్రయాణిస్తున్నారా?

ఎక్కువ దూరం రైలులో వెళ్లాలంటే చాలామంది రాత్రి ప్రయాణానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. 10:00 PM తర్వాత ఇతరులకు ఇబ్బంది కలిగించేలా మ్యూజిక్ పెట్టకూడదు. వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. ఈ-టికెట్‌తో ప్రయాణించే వారు ID కార్డు చూపించాలి. మద్యం సేవించడం నేరం. ఏదైనా సమస్య వస్తే RPF లేదా 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
News December 18, 2025
కాకినాడ రూరల్‌పై మాజీ మంత్రి కన్ను

తాళ్లరేవు నియోజవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు మంత్రిగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన చిక్కాల రామచందర్రావు ఓసారి రామచంద్రపురంలో పోటీ చేసి ఓటమి చెందారు. టీడీపీకి వీర విధేయుడు. తాజాగా ఆయన కాకినాడ రూరల్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గానికి నాలుగేళ్ల నుంచి ఇన్‌ఛార్జ్ లేరు. దీంతో ఆయన రూరల్ పగ్గాలు చేపట్టేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
News December 18, 2025
వనపర్తి: సకాలంలో డబ్బులు జమ చేయాలి: కలెక్టర్

కష్టపడి ధాన్యం పండించిన రైతులకు సకాలంలో డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా సహకార సంఘం, సివిల్ సప్లై అధికారులతో వరి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొన్నాము, ఇంకా ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావాల్సి ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.


