News September 11, 2025
విజయవాడ: ఆ ఆసుపత్రిలో ఎక్విప్‌మెంట్ ఫుల్.. సిబ్బంది నిల్

రాణిగారితోటలోని పట్టణ ప్రాధమిక ఆరోగ్యకేంద్ర సేవలకు సిబ్బంది కొరత వేధిస్తోంది. ల్యాబ్ టెక్నిషియన్, డాక్టర్, ఫార్మసిస్ట్ లేకపోవడంతో ప్రస్తుతం ఇద్దరు స్టాఫ్ నర్సులే ఈ కేంద్రానికి వచ్చే రోగులకు సేవలు అందిస్తున్నారు. ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మసిస్ట్ లేకపోవడంతో రూ.లక్షల విలువైన ఎక్విప్‌మెంట్ ఉన్నా వ్యాధినిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. ప్రభుత్వం స్పందించి సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News September 11, 2025
MBNR: వాకిటి శ్రీహరికి హోంశాఖ ఇవ్వాలి- శ్రీనివాస్ గౌడ్

వాకిటి శ్రీహరికి ప్రాధాన్యంలేని మత్స్యశాఖ కట్టబెట్టి నిధులు ఇవ్వడంలేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ లేదా హోంశాఖ కేటాయిస్తే బాగా పనిచేస్తారన్నారు. గురువారం HYDలోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. ముదిరాజ్‌లను బీసీ ఏ గ్రూప్‌లో చేరుస్తామని మోసం చేస్తున్నారన్నారు. CM, పీసీసీ ప్రెసిడెంట్ చర్చించి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలకు GO ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
News September 11, 2025
మన కంపెనీలకు సవాలేనా?

చైనా, వియత్నాం నుంచి భారత ఆటోమొబైల్ కంపెనీలకు సవాల్ ఎదురుకానుంది. చైనాకు చెందిన ప్రముఖ ఈవీ కార్ల కంపెనీ BYD.. ఇండియాలో ప్లాంట్ పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటే సుంకాల వల్ల రేట్లు విపరీతంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Atto 2 SUV EVని రూ.20 లక్షల్లోపు తీసుకురావాలని భావిస్తోంది. అటు వియత్నాం VinFast రూ.16 లక్షలకే VF6 EV కారును లాంఛ్ చేసింది.
News September 11, 2025
దసరాకి ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు: మంత్రి వాసంశెట్టి

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గురువారం రామచంద్రాపురంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిలో భాగంగా దసరా పండుగకు ఆటో డ్రైవర్లకు రూ.15,000 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన ‘సీఎం అంటే కామన్ మ్యాన్’ అనేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.