News November 1, 2025
విజయవాడ: ఈ నెల 7న మెగా జాబ్ మేళా

విజయవాడలోని SRR కళాశాలలో ఈ నెల 7న APSSDC ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 30 కంపెనీలు పాల్గొనే ఈ మేళాకు SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు హాజరవ్వాలని, ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.10-35 వేల వేతనం ఉంటుందన్నారు. https://naipunyam.ap.gov.in/లో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News November 1, 2025
భీమవరం: పింఛన్లు అందజేసిన కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతోందని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం వీరమ్మ పార్క్ చుట్టుపక్కల శనివారం లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లు అందించారు. లబ్దిదారులకు పింఛన్లు అందజేసి వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొన్నారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది లబ్దిదారుల ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారా అని ఆరా తీశారు.
News November 1, 2025
షట్‌డౌన్ ఎఫెక్ట్.. అమెరికాలో $7 బిలియన్లు ఆవిరి

అమెరికా గవర్నమెంట్ <<17882827>>షట్‌డౌన్ <<>>సంక్షోభం మరింత ముదురుతోంది. అక్టోబర్ 1 నుంచి ఇప్పటిదాకా $7 బిలియన్ల నష్టం వాటిల్లినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఈ ప్రతిష్టంభన ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై అంత ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. షట్‌డౌన్ ఆరు వారాలు కొనసాగితే $11 బిలియన్లకు, 8 వారాలు కొనసాగితే $14 బిలియన్లకు నష్టాలు పెరుగుతాయని హెచ్చరించింది.
News November 1, 2025
ధాన్యం తేమ 17% లోపు ఉండాలి: ఏడీఏ

తొగుటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పీఏసీఎస్ మొక్కజొన్న, ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను దుబ్బాక డివిజన్ ఏడీఏ కాంపాటి మల్లయ్య శనివారం సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని సూచించారు. వరి ధాన్యంలో తేమ శాతం 17% లోపు ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


